Tuesday, 29 January 2013

9.Printf ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం


  • Write A Program To Print Your Name and Age At Output
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
 

          clrscr();


          printf("mahesh7993.blogspot.in");
          printf("502");

          getch(); 
}

ఇప్పుడు మనం పైన వ్రాసిన ప్రోగ్రాం output ఈ క్రింది విధంగా రావాలి 

mahesh7993.blogspot.in
502

ఇలా పైన చూపిన విధంగా output రావాలి కానీ output పైన చూపిన విధంగా రాదుకరెక్ట్ output అనేది క్రింద చూపించిన విధంగా ఒక దాని ప్రక్కన ఒకటి ప్రింట్ అవుతుంది 
.
.
.
.
.
.

ఇప్పడు మీకు ఒక సందేహం (డౌట్) రావచ్చు. ఇలా ప్రక్కప్రక్కన ప్రింట్ అయ్యేటప్పుడు ఒకే printf statement లో వ్రావచ్చు గా అని . అవును మీ సందేహం  కరెక్ట్ నే కాబట్టి  పైన వ్రాసిన  ప్రోగ్రాం ని క్రింద వ్రాసిన విధంగా కూడా వ్రాయవచ్చు ..

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();

          printf("mahesh7993.blogspot.in  502");

          getch();
}

ఈ ప్రోగ్రాం output కూడా same పైన చూపిన విధంగా నే వస్తుంది అంటే ప్రక్కప్రక్కన ప్రింట్ అవుతుంది . కాని మనకి కావాల్సింది ఒకదాని క్రింద ఒకటి ప్రింట్ అవ్వాలి ...

ఒకదాని క్రింద ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే మనం " C Language " లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ని Printf Statement లో వ్రాయాలి . ఆ క్యారెక్టర్ ఏమిటి అంటే ..
                                  \n --- అంటే కొత్త వరుస అని (New Line )


సరే ఇప్పుడు కరెక్ట్ గా ఒకదాని క్రింద ఒకటి ఎలా ప్రింట్ అవ్వాలో ప్రోగ్రాం వ్రాద్దాం 

  • Write A program To print Your Name And Age Line By Line..
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
 

          clrscr();

          printf("mahesh7993.blogspot.in \n");
          printf("502");

          getch(); 
}

పైన  ప్రోగ్రాం  లో  \n (New line) ని 1st printf Statement లో చివర వ్రాసిం కాబట్టి మనకి output అనేది  1st printf Statement వున్నది మొదటి వరుసలో ప్రింట్ అవ్వి మిగతాది మొత్తం రెండోవ వరుస లో ప్రింట్ అవుతుంది 

పైన ప్రోగ్రాం ని క్రింద చూపిన విధంగా కూడా వ్రాయవచ్చు 
   
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();

          printf("mahesh7993.blogspot.in \n 502");

          getch();
}

ఈ ప్రోగ్రాం లో ఒకే ఒక printf statement ఉంది ఇందులో  \n ( New Line ) అనేది మద్యలో ఉంది కాబట్టి ఎక్కడైతే new line ( \n ) ఉందో అక్కడ నుండి ఉన్నది మొత్తం రెండోవ వరుస లో ప్రింట్ అవుతుంది.

పైన వ్రాసిన రెండు ప్రోగ్రామ్స్ కి ఒకే విధంగా output వస్తుంది ఈ output క్రింద చూపించిన విధంగా వుంటుంది ..
.
.
.
.
.
ఇప్పుడు మీకు \n మీద ఒక ఐడియా వచ్చి వుంటుంది. \n ( New Line ) ని మీరు printf statement లో ఎక్కడైనా వ్రావచ్చు ఎక్కడైతే \n ( New Line )  వ్రాస్తామో అక్కడ నుండి ఉన్నది మొత్తం ఇంకొక వరుస లో ప్రింట్ అవుతుంది output లో ..............


మరికొన్ని Examples Printf గురించి వ్రాద్దాం

Write a Program To print U R Bio-Data at output

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();
  
         printf("name=mahesh.B");
         printf("age=22");
         printf("gender=male");
         printf("father name=subrahmanyam");
         printf("qualification=B.Tech");

          getch();
}
ఈ ప్రోగ్రాం Output ఈ క్రింద చూపించిన విధంగా వుంటుంది 

output:

name=mahesh.B age=22 gender=male father name=subrahmanyam  qualification=B.Tech 

ఒకదాని ప్రక్కన ఒకటి ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనం అక్కడ \n ( New line ) అనేది ఎక్కడ ఉపయోగించలేదు .ఇంకో ప్రోగ్రాం చూద్దాం

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();
  
         printf("name=mahesh.B\n");
         printf("age=22");
         printf("gender=male\n");
         printf("father name=subrahmanyam\n");
         printf("qualification=B.Tech");

          getch();
}

పైన ప్రోగ్రాం లో New line ( \n ) అనేది 1,3,4 printf statements చివరలోనే వున్నాయి కాబట్టి వాటి తరవాత ఉన్నది మాత్రమే ఇంకో వరుసలో ప్రింట్ అవుతుంది

Ouput:
name=mahesh.B
 age=22 gender=male 
father name=subrahmanyam  
qualification=B.Tech 
ఇలా printf statement లో New Line ని మనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు ...............

No comments:

Post a Comment