C Language గురించి తెలుసుకునే ముందు అసలు కంప్యూటర్ లో data అనేది ఏలా మెమరీ లో సేవ్ అవుతుందో తెలుసుకోవాలి .
కంప్యూటర్ లో మనం ఏ కీ ( key ) ప్రెస్ చేసిన (or ) ఏదైనా సాంగ్ (లేదా) వీడియో (లేదా) ఏదైనా డేటా ( data ) ని వేస్తే అది కంప్యూటర్ లో ఉండే మెమరీ లో సేవ్ అవుతుంది . సేవ్ అయినప్పుడు ప్రతి డేటా ( కంప్యూటర్ లో వేసే ప్రతి దాన్ని డేటా అంటారు ) కి ఒక నెంబర్ ని ఇస్తుంది . ఈ నెంబర్ నే మెమరీ లొకేషన్ అడ్రస్ (Memory location Address ) అంటారు . ఈ నెంబర్ వలన ఉపయోగం ఏమిటి అంటే త్వరగా డేటా ని access చేయవచ్చు.అంటే ఇప్పుడు కంప్యూటర్ లో ఏ పని చేసిన అది మెమరీ లొకేషన్ లో సేవ్ అవుతుంది . కాబట్టి దానికి ఒక నెంబర్ ఇస్తుంది అ నెంబర్ నే మెమరీ లొకేషన్ అడ్రస్ అంటాం
కంప్యూటర్ పరంగా చూస్తే Language's అనేవి 3 రకాలు :
- Low Level Language: కంప్యూటర్ కి దానంతటా అది ఏమి చేయలేదు . దానికి అర్దమయ్యేదెల్లా 0 ( సున్న ), 1 (ఒకటి) మాత్రమే. ఇలా 0 , 1 వున్న లాంగ్వేజిని Low Level Language అంటారు.ఈ లాంగ్వేజ్ కంప్యూటర్ కి అర్ధం అయ్యే బాష .మనం కంప్యూటర్ తో ఏమి చేయాలి అన్నా కంప్యూటర్ కి సున్న,ఒకటి లోనే చెప్పాలి ఇలా చెబితేనే కంప్యూటర్ కి అర్ధం అవుతుంది. కాని ప్రతిది ఇలా 0, 1 లతో కంప్యూటర్ కి చెప్పాలి అంటే చాలా కష్టం.
ఉదాహరణ :
రెండు అంకెలను కూడాలి అంటే ఈ లాంగ్వేజిలో ఏలా వ్రాస్తమో చుద్దాం
0001 0111 0100 - Middle Level Language : Middle level languages అంటే మనం కంప్యూటర్ లో programs ని కొన్ని నిమోనిక్ కోడ్స్ ఉపయోగించి ప్రోగ్రామ్స్ వ్రాస్తాం అంటే MOV ADD SUB DIV అని కొన్ని నిమోనిక్ కోడ్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి ప్రోగ్రామ్స్ అనేవి Direct గా కంప్యూటర్ యొక్క మెమరీ , Registers మీద ప్రోగ్రామ్స్ వ్రాస్తాం ఈ నిమోనిక్ కోడ్స్ కూడా కంప్యూటర్ కి అర్ధం కాదు కంప్యూటర్ కి ఒక్క Machine level language లో ఉంటేనే అర్ధం అవుతుంది . కాబట్టి ఈ మిడిల్ లెవెల్ లో వ్రాసిన programs computer కి అర్ధం అవ్వాలి అంటే computer వీటిని కూడా low level లాంగ్వేజ్ లో కి మార్చాలి . అప్పుడు మాత్రమే కంప్యూటర్ అర్ధం చేసుకుంటుంది వీటిని కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం .
- High level language : మనం మాట్లాడే బాషని / మనం కంప్యూటర్ లో వ్రాసే programs (C , C++, JAVA ... ) ని High level language అంటారు . ఈ language ని computer అర్ధం చేసుకోలేదు . అంటే మనం కంప్యూటర్ లో GENERAL గా టైపు చేసే మేటర్ ని కంప్యూటర్ అర్ధం చేసుకోలేదు .కంప్యూటర్ మనం టైపు చేసేది అర్ధం చేసుకోవాలి అంటే అది కంప్యూటర్ కి అర్ధం అయ్యే బాష లోకి మార్చు కోవాలి . computer programming languages లో High నుండి Low కి మార్చాలి అంటే Compiler/ Interpreter అనేవి ఉంటాయి . కంప్యూటర్ కి అర్ధం అయ్యే బాష ని మెషిన్ లెవెల్ ( MACHINE LEVEL LANGUAGE / LOW LEVEL LANGUAGE/ BINARY LEVEL LANGUAGE ) అంటారు .
కాని ఈ Low Level Language కోడ్స్ అనేవి కంప్యూటర్ నుండి కంప్యూటర్ కి మారి పోతుంటాయి వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం .
- కాబట్టి ఇప్పుడు మనం "C" Language లో వ్రాసినా Program అనేది High Level Language లో వుంటుంది . అది కంప్యూటర్ కి అర్ధం కాదు కాబట్టి Low level లో కి మార్చాలి .
"C" Language లో వ్రాసినా Program అనేది High Level లాంగ్వేజ్ నుండి Low Level లో కి మార్చాలి Compiler వుంటుంది . ఈ Compiler అనేది Low level లో కి వ్రాసిన Program ని మారుస్తుంది . Program వ్రాసిన తర్వాత ALT+F9 Press చేస్తే Low Level లో కి మారిపోతుంది . అప్పుడు FileName .Obj అనే Extra ని File Create చేస్తుంది. ఈ File ని చూడాలి అనుకుంటే మీరు Program వ్రాసిన Folder లొ చూడండి కనబడుతుంది .
మనం Program యొక్క Output చూడాలి అంటే Ctrl+F9 ని Press చేస్తే మనం Output ని చూడవచ్చు
కంపైలర్ ఎలా పనిచేస్తుందో తెలియజేయు చిత్ర పటం |
కంపైలర్ ఎలా పనిచేస్తుందో తెలియజేయు చిత్ర పటం |
No comments:
Post a Comment