Tuesday, 29 January 2013

INFORMATION ABOUT AADHAAR CARD

Welcome to Resident Portal
Resident Portal

సి లాంగ్వేజ్ (C Language)

10.Printf ఉపయోగించి మరి కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం continue


Character
Escape Sequence
Newline
\n
Horizontal tab
\t
Vertical tab
\v
Backspace
\b
Carriage return
\r
Alert
\a
Backslash
\\
Question mark
\?
Single quotation mark
\'
Double quotation mark
\"


ఇంతక ముందు పాఠం లో printf  ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకున్నాం కదా \n గురించి తెలుసుకున్నాం .. \n లాంటివి ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి . ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం .

మర్చిపోయానండోయ్ ఈ ప్రత్యేకమైన పదాలను Escape Sequence అంటారు . పైన table లో ఈ పదాల లిస్ట్  ఉంది  చూడండి .

Horizontal Tab ( \t ) : 

ఇంతక ముందు ప్రోగ్రాం లో printf లోపల రెండు పదాల మధ్య \n ని వాడితే ఆ  రెండు పదాలు వేరువేరు వరుసలలో ప్రింట్ అవుతాయి . అలాగే రెండు పదాల మధ్య \t  ని వాడితే ఆ  రెండు పదాల మధ్య ఒక అంగుళం ఖాళీ (space ) ప్రింట్ అవుతుంది . క్రింది ప్రోగ్రాం లో దీనిని ఎలా వాడుతారో చుద్దాం 


Program  on  Horizontal Tab :

computer in telugu horizontal tab
Output :

9.Printf ఉపయోగించి కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం


  • Write A Program To Print Your Name and Age At Output
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
 

          clrscr();


          printf("mahesh7993.blogspot.in");
          printf("502");

          getch(); 
}

ఇప్పుడు మనం పైన వ్రాసిన ప్రోగ్రాం output ఈ క్రింది విధంగా రావాలి 

mahesh7993.blogspot.in
502

ఇలా పైన చూపిన విధంగా output రావాలి కానీ output పైన చూపిన విధంగా రాదుకరెక్ట్ output అనేది క్రింద చూపించిన విధంగా ఒక దాని ప్రక్కన ఒకటి ప్రింట్ అవుతుంది 
.
.
.
.
.
.

ఇప్పడు మీకు ఒక సందేహం (డౌట్) రావచ్చు. ఇలా ప్రక్కప్రక్కన ప్రింట్ అయ్యేటప్పుడు ఒకే printf statement లో వ్రావచ్చు గా అని . అవును మీ సందేహం  కరెక్ట్ నే కాబట్టి  పైన వ్రాసిన  ప్రోగ్రాం ని క్రింద వ్రాసిన విధంగా కూడా వ్రాయవచ్చు ..

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();

          printf("mahesh7993.blogspot.in  502");

          getch();
}

ఈ ప్రోగ్రాం output కూడా same పైన చూపిన విధంగా నే వస్తుంది అంటే ప్రక్కప్రక్కన ప్రింట్ అవుతుంది . కాని మనకి కావాల్సింది ఒకదాని క్రింద ఒకటి ప్రింట్ అవ్వాలి ...

ఒకదాని క్రింద ఒకటి ప్రింట్ అవ్వాలి అంటే మనం " C Language " లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ని Printf Statement లో వ్రాయాలి . ఆ క్యారెక్టర్ ఏమిటి అంటే ..
                                  \n --- అంటే కొత్త వరుస అని (New Line )


సరే ఇప్పుడు కరెక్ట్ గా ఒకదాని క్రింద ఒకటి ఎలా ప్రింట్ అవ్వాలో ప్రోగ్రాం వ్రాద్దాం 

  • Write A program To print Your Name And Age Line By Line..
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
 

          clrscr();

          printf("mahesh7993.blogspot.in \n");
          printf("502");

          getch(); 
}

పైన  ప్రోగ్రాం  లో  \n (New line) ని 1st printf Statement లో చివర వ్రాసిం కాబట్టి మనకి output అనేది  1st printf Statement వున్నది మొదటి వరుసలో ప్రింట్ అవ్వి మిగతాది మొత్తం రెండోవ వరుస లో ప్రింట్ అవుతుంది 

పైన ప్రోగ్రాం ని క్రింద చూపిన విధంగా కూడా వ్రాయవచ్చు 
   
#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();

          printf("mahesh7993.blogspot.in \n 502");

          getch();
}

ఈ ప్రోగ్రాం లో ఒకే ఒక printf statement ఉంది ఇందులో  \n ( New Line ) అనేది మద్యలో ఉంది కాబట్టి ఎక్కడైతే new line ( \n ) ఉందో అక్కడ నుండి ఉన్నది మొత్తం రెండోవ వరుస లో ప్రింట్ అవుతుంది.

పైన వ్రాసిన రెండు ప్రోగ్రామ్స్ కి ఒకే విధంగా output వస్తుంది ఈ output క్రింద చూపించిన విధంగా వుంటుంది ..
.
.
.
.
.
ఇప్పుడు మీకు \n మీద ఒక ఐడియా వచ్చి వుంటుంది. \n ( New Line ) ని మీరు printf statement లో ఎక్కడైనా వ్రావచ్చు ఎక్కడైతే \n ( New Line )  వ్రాస్తామో అక్కడ నుండి ఉన్నది మొత్తం ఇంకొక వరుస లో ప్రింట్ అవుతుంది output లో ..............


మరికొన్ని Examples Printf గురించి వ్రాద్దాం

Write a Program To print U R Bio-Data at output

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();
  
         printf("name=mahesh.B");
         printf("age=22");
         printf("gender=male");
         printf("father name=subrahmanyam");
         printf("qualification=B.Tech");

          getch();
}
ఈ ప్రోగ్రాం Output ఈ క్రింద చూపించిన విధంగా వుంటుంది 

output:

name=mahesh.B age=22 gender=male father name=subrahmanyam  qualification=B.Tech 

ఒకదాని ప్రక్కన ఒకటి ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనం అక్కడ \n ( New line ) అనేది ఎక్కడ ఉపయోగించలేదు .ఇంకో ప్రోగ్రాం చూద్దాం

#include<stdio.h>
#include<conio.h>

void main()
{
          clrscr();
  
         printf("name=mahesh.B\n");
         printf("age=22");
         printf("gender=male\n");
         printf("father name=subrahmanyam\n");
         printf("qualification=B.Tech");

          getch();
}

పైన ప్రోగ్రాం లో New line ( \n ) అనేది 1,3,4 printf statements చివరలోనే వున్నాయి కాబట్టి వాటి తరవాత ఉన్నది మాత్రమే ఇంకో వరుసలో ప్రింట్ అవుతుంది

Ouput:
name=mahesh.B
 age=22 gender=male 
father name=subrahmanyam  
qualification=B.Tech 
ఇలా printf statement లో New Line ని మనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవచ్చు ...............

8. సి లాంగ్వేజ్ నియమ నిబందనలు C Programing Rules

ప్రతి భాషకు కొన్ని Rules వుంటాయి . అంటే English నేర్చుకోవాలి అంటే దాని Grammer ని నేర్చుకుంటేనే దాన్ని సరిగ్గా వ్రాస్తాం అలాగే " C " Language నేర్చుకోవాలి అంటే దానికి సంబందించిన Rules ని నేర్చుకోవాలి .


C Language Rules :
  1. ప్రతి "C" Progarm లో Starting point main() అనే Function

    Note: main() పైన #include అని వ్రాసిన (ముందు program చూడండి) అవి Only దానికి సంబందించిన Functions Work అవ్వడానికి మాత్రమే.
    Example : printf("");
    అవ్వాలి అంటే దానికి సంబందించిన program Stdio.h లో vundhi  printf work అవ్వాలి అంటే stdio.h ని include చేసుకోవాలి అంటే గాని program Starting Point మాత్రం main() నుండే 
  2. main() function లోపల వ్రాసిన ప్రతి statement SEMI COLON ; తో END అవ్వాలి  .( English లో ఒక sentence End అవ్వాలి అంటే full stop . ఏలాగో ఇక్కడ semicolon అలాగా )
  3. main() Function కి Begining Bracket and Ending Bracket వుంటుంది . వీటి మద్యలో నే  ea  statements ina  వ్రాయాలి .
  4. main() Function పైన వ్రాసిన  #include statements ని Header files అంటారు . ఇవి అవసరం  అయితేనే వ్రాసుకోవాలి లేకపోతే లేదు



  5. మీరు  వ్రాసిన Program ని ఎఅదూక్  filename ఇచ్చి .(dot)c తో save చేయాలి

    Example:    program1.c
                        pro.c
                        abcdfeg.c
  6. Progarm ని Complie  చేయడానికి    ALT+F9
                       Run        చేయడానికి   CTRL+౯   ( Output చూడడానికి )


------------------

C programming Video tutorial:

ఈ వీడియోలో  "c program" ఎలా  వ్రాయాలి  ఎలా   save చేయాలి  అని  ఎలా compile చేయాలి  మరియు  ఎలా output చూడాలి  అని చూపిస్తుంది 






7. సి లాంగ్వేజ్ మొదటి ప్రోగ్రాం First Program In C


మనం ఏ Programming language లో అయినా ఆల్‌గారిధమ్ వ్రాసినా దాన్ని బట్టి మాత్రమే Program వ్రాస్తాం .
ఇప్పుడు మనం ఒక ఆల్‌గారిధమ్ వ్రాసి దాన్ని C Language లో ఎలా  వ్రాస్తారో చూద్దాం

Write a Algorithm To print a message "HELLO WORLD "?

STEP1:  
Start

Step2:    print HELLOWORLD

STEP3:  END
అచ్చం  పైన  వ్రాసిన ఆల్‌గారిధమ్ ని "C " లాంగ్వేజ్ లో ఎలా వ్రాస్తారో చూద్దాం 

Write a Program to print Hello world message At output ?

#include 
< stdio.h >

void main()
{
    
 printf(" Hello world ");

}
ఆల్‌గారిధమ్ లో Starting step "start " ఇక్కడ అంటే "C " Language లో Stating Step Void main(). ఆల్‌గారిధమ్ లో STEP2 print HELLO WORLD  కాబట్టి  
ఇక్కడ అంటే "C " Language లో printf(" hello world "); Use చేస్తాం . ఆల్‌గారిధమ్ లో STEP3 End చేయడం కాబట్టి ఇక్కడ Ending కి } use చేస్తాం.
printf syntax:

                    printf (" ఈ కొటేషన్'s  మద్యలో ఏది  వ్రాస్తే అది output లో ప్రింట్ అవుతుంది ");


Examples On printf :

  • printf(" hai ") ; -----------------> hai అని output లో ప్రింట్ అవుతుంది 
  • printf("  siva naadh baazi is great  "); --------------------> sivanaadh baazi is గ్రేట్ అని output  లో ప్రింట్ అవుతుంది 
  • printf("your name");----------------------> your name అని output లో ప్రిన్త్ఫ్ అవుతుంది 


" Printf work అవ్వాలి  అంటే  printf కి  సంబంధించిన   program already వ్రాసి  వుంది  దాన్ని  మనం  include చేసుకోవాలి అదే మనం void main() పైన వ్రాసిన stdio.h ఈ  file లో  printf కి  సంబంధించిన  program ఉంది  కాబట్టి  దాన్ని  #include ద్వార   ఈ  program లో  కి  Include చేసుకున్నాం"


ఇప్పుడు  program ని  compile చేద్దాం compilation కోసం  ALT+F9 ని  Press చెయ్యాలి  . అప్పుడు  program లో  ERRORS ఉంటె  Error's ని చూపిస్తుంది లేక పోతే Errors దగ్గర 0 అని చూపిస్తుంది .


compilation తర్వాత మనం Output చూడాలి కాబట్టి Output చూడాలి అంటే CTRL+F9 press చేయాలి . CTRL+F9 PRESS చేస్తే Output వస్తుంది  కానీ ఇప్పుడు పైన వ్రాసిన Program వ్రాసి   OUTPUT చూస్తే  రాదు  ఎందుకంటే OUTPUT వస్తుంది . గాని Output స్క్రీన్  మనకి  కనిపించదు  . మరి  ఇప్పుడు  Output చూడాలి  అంటేALT+F5 press చేస్తే  వస్తుంది  output క్రింద  చూపించిన picture లో  చూడండి 


pro1

ok నా . ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా . ఓకే మళ్ళి PROGRAM ని compile చేసి Execute చేసి output చూద్దాం. ఈ output ని క్రింద చూపించినా Picture లో లాగా వుంటుంది .

pro2

పైన OUTPUT లో Hello world Hello world అని రెండు సార్లు print అవుతుంది . కాని మనం రాసిన Program లో Hello world అని printf లో వ్రాసింది ఒక్క సారే . కాబట్టి ఒక్కసారే output లో print అవ్వాలి . కాని ఇక్కడ రెండు సార్లు ఉంది అందులో First Hello world అనేది అంతకముందు ఒకసారి program యొక్క Output చూస్యం కదా అది దాని Output. ఇంక్కోసారి Hello world అని రెండవ సారి print అయింది కదా అది ఇప్పుడు Output చూసినా Program Output.

అంతకముందు program Output మనకి అవసరం లేదు .మనకి కేవలం present program output వరకు  మాత్రమే చాలు కాబట్టి previous program output ని clear చేసేయాలి . కాబట్టి మనం ప్రోగ్రాం లో   " clrscr() " అనే statement ని వ్రాయాలి .

clrscr() --------> అంటే clear screen అని meaning 


clrscr() work అవ్వాలి అంటే దానికి సంబందించిన program ని Include చేసుకోవాలి . ఆ program " conio.h " .

ఇప్పటి వరకు మనం Ctrl+F9 Press చేస్తే Output ని చూడలేకపోతున్నాం . అంటే output Screen మనకి కనిపించడం లేదు . Output screen ని Ctrl+f9 press చేసినప్పుడు చూడాలి అంటే మనం "  getch () " అనే 
ఒక statement ని Ending Bracket ముందు వ్రాయాలి 

getch () ------> అంటే Get character అని meaning ఇది Output Screen ని ఏదయినా key press చేసే అంత వరకు అలాగే ఉంచుతుంది .

getch () ------> work అవ్వాలి అంటే దానికి సంబందించిన program ని Include చేసుకోవాలి . ఆ program " conio.h " .

కాబట్టి Final  గా పైన  Program ని ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు 

#include < stdio.h >
#include < conio.h >

void main()
{
         clrscr();

         printf(" Hello world ");

         getch();

 }


ఇప్పుడు మనం ఎన్ని  సార్లు వెంట వెంటనే output చూసినా output లో ఒక్క సారి మాత్రమే print అవుతుంది ......
                                            Next Chapter C Program Rule's